135 crores per acre: అప్పట్లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియో పోలిస్ ప్రాంతంలో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన లే అవుట్లను వేలం వేస్తే ఎకరం 100 కోట్లు పలికింది. అప్పట్లో దానిని తమ ప్రభుత్వం గొప్పతనానికి నిదర్శనమని గులాబీ పార్టీ పేర్కొంది. తన కరపత్రిక నమస్తే తెలంగాణలో బీభత్సంగా రాసుకుంది.. అంతేకాదు అధికారం పైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా అనే వ్యవస్థ వల్ల సర్వం నాశనం అయిందని శోకాలు పెట్టింది. కానీ ఇప్పుడు గులాబీ పార్టీ అధికారంలో ఉన్న దాని కంటే ఇంకా ఎక్కువకే భూములు అమ్ముడుపోతున్నాయి. కోకాపేట ప్రాంతంలో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన భూములను వేలం వేస్తే ఎకరం ధర 137 కోట్లు పలికింది.
కోకాపేట ప్రాంతంలో ఎకరం 137 కోట్లు పలకడం హై ఎండ్ ప్రైస్ అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఊహించిన విధంగా భూములకు డిమాండ్ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వారు అంటున్నారు. కోకాపేట ఒకప్పుడు బయటి ప్రాంతంగా ఉండేది.. అయితే బాహ్యవలయ రహదారి వల్ల ఒక్కసారిగా ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది.. అనేక కమర్షియల్ ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి వచ్చాయి.. అందువల్లే ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందువల్లే బిడ్డర్లు పోటీపడి భూములను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. అందువల్లే ఈ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి.
హైటెక్ సిటీకి దగ్గరగా ఉండటం వల్ల రాయదుర్గం అనే ప్రాంతం లో భూములను వేలం వేస్తే ఎకరం ధర 117 కోట్ల పలికింది.. కోకాపేట ప్రాంతంలో ఆ స్థాయిలో ధర పలకకపోయినప్పటికీ ప్రధాన ఐటీ హబ్ ను దాటి విస్తరించడం వల్ల కోకాపేట ప్రాంతంలో భూములకు విపరీతమైన ధర ఉంది.
భవిష్యత్ కాలంలో మౌలిక సదుపాయాలు, ప్రణాళిక బద్ధమైన టెక్ జోన్లు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు కారణంగా పెట్టుబడిదారులు కోకాపేట వైపు దృష్టి సారిస్తున్నారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్నా కొద్దీ కోకాపేట పరిసర ప్రాంతాలు ప్రీమియం పెట్టుబడి హాట్ స్పాట్ లుగా మారతాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.. “భవిష్యత్తు కాలం మొత్తం ఈ ప్రాంతం కేంద్రంగా కార్యకలాపాలు సాగుతాయి.. పెట్టుబడి వ్యూహాలు కూడా ఈ ప్రాంతం ఆధారంగానే సాగుతాయి. అందువల్లే ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఉందని” రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.