Celebrity Kids: ఒకప్పుడు నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో చంద్రమోహన్ ఒకరు…ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయిన కూడా ఒకప్పుడు ఆయన ఇంల్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన సెలబ్రిటీ పిల్లలు ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా గొప్ప చెప్పాడు… తన తోటి ఆర్టిస్టుల పిల్లలు డబ్బుల కారణంగా చెడిపోయారనే విషయాన్ని చంద్ర మోహన్ క్లారిటీ గా చెప్పారు. ముఖ్యంగా ఆర్ నాగేశ్వర్ రావు, హరినాథ్ కొడుకులు పండిత పుత్ర పరమ శుంఠ అనే రీతిలో ఉండేవారట…ఇక రంగరావు కొడుకైతే మరి డేంజర్ అని చెప్పాడు. తనకి ఉన్నది ఒక్కడే కొడుకు అయిన కూడా వాడు 14 సంవత్సరాల నుంచే మందు తాగడం. మేము కలిస్తే అంకుల్ ఒక 100 రూపాయలు ఇవ్వండి అని గోల చేయడం లాంటివి చేసేవాడు. రంగారావు మాత్రం వాడికి డబ్బులు ఇవ్వకండి అని మాతో చెప్పేవాడు. ఇక రేలంగి కొడుకు కూడా అసలు ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఇక నాగయ్య కొడుకులు మరి దారుణంగా తయారవడంతో ఆయన చివరి స్టేజ్ లో 500, 1000 రూపాయలకు మాతో పాటు నటించేవాడు.
అందుకే వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇండస్ట్రీ లో ఎలా ఉండాలో నేర్చుకున్నాను. మన పిల్లల్ని ఎలా పెంచాలో అర్థమైంది. అందుకే చెడు వ్యసనాలకు పాల్పడకుండా నా పిల్లల్ని చాలా బాగా పెంచాను. మనం కూడా డబ్బులు వచ్చే కొద్ది ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా నేర్చుకున్నాను. ఇక చంద్రమోహన్ కెరియర్ మొదట్లో చిన్న చితక పాత్రలను చేస్తూ ఆ తర్వాత హీరోగా మారి మంచి సినిమాలు చేసి గొప్ప విజయాన్ని సాధించాడు.
అందుకే ఆయనకి గొప్ప పేరయితే వచ్చింది. అలాంటి నటుడు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా కెరియర్ లో ఎన్నో గొప్ప పాత్రలను పోషించాడు… అలాంటి చంద్రమోహన్ తనతోటి సమకాలీన హీరోల కంటే ఎక్కువ సంపాదించాడు…
కారణం ఏంటంటే ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టడంతో వాటి వాల్యూ ఈరోజు వందల కోట్లకు పెరిగిపోయింది. ప్రస్తుతం చంద్ర మోహన్ మన మధ్య లేకపోయిన కూడా ఒక హీరో ఫాదర్ క్యారెక్టర్ గురించి డిస్కషన్ వచ్చిన ప్రతి సారి మనకు చంద్రమోహన్ గారే గుర్తుకు వస్తారంటే ఆయన ఎంత మంచి నటుడో మనం అర్థం చేసుకోవచ్చు…