Revanth Reddy: 95 రోజుల్లో 45 లక్షల సభ్యత్వాలు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నుంచి ఆశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్ల వరకు చేరికలు. ఇవీ హుజురాబాద్ ఓటమి తర్వాత కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న సానుకూల లక్షణాలు. అంతకుమించి రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత సాధించిన ఘనతలు. బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాతం, ఇతర కార్పొరేటర్లు, మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ రాజ్య లక్ష్మీ, ఖైరతాబాద్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ విజయ రెడ్డి.. వీరంతా అధికార పార్టీ నాయకులు, అంతకుమించి పదవులు అనుభవిస్తున్న వారు.. వీరు ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అది కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో.. చేరికలు ఇంకా మునుముందు భారీగా ఉంటాయని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి హస్తవ్యస్తంగా ఉన్న కాంగ్రెస్కు ఈ చేరికలు ఎంత మేరకు లాభం చేకూర్చుతాయి? దూకుడు మీద ఉన్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో ఉన్న పాత తరం నేతలకు పొసుగుతుందా? రేవంత్ రెడ్డి మరో రాజశేఖర రెడ్డి అవుతారా? ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సాధించిన పరిణతి ఎంత?
2001 లో రాజశేఖర్ రెడ్డి
టిడిపిలో మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన రోజులవి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ వాదాన్ని వినిపిస్తానని చెప్పి ఉపఎన్నికల్లో మరలా పోటీకి దిగారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ సమయంలో సిద్దిపేటలో కెసిఆర్ కు పోటీగా కాంగ్రెస్ తరపున హనుమంత్ రెడ్డి ని బరిలో దింపారు. ఆ సమయంలో హనుమంత్ రెడ్డి కేవలం 3,500 ఓట్లు మాత్రమే సాధించి దారుణమైన ఓటమిపాలయ్యారు. ఇదే క్రమంలో అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పని తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు రుసరుస లాడారు. ఒకరకంగా సిద్దిపేటలో ఓటమి తర్వాతే వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు పూనుకున్నారని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఏకంగా 2004, 2018 వరుస అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేజిక్కించుకుంది.
Also Read: Nagababu: అన్నయ్య తప్ప అందరూ నటించారు.. భీమవరం సభపై నాగబాబు షాకింగ్ కామెంట్
రేవంత్ రెడ్డి అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు
రేవంత్ రెడ్డి రాజకీయ జీతాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆయన ఏ పార్టీలో ఉన్నా అది ప్రతిపక్షంలోనే… టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు, టిడిపిలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన ప్రశ్నించే తత్వాన్నే అనుసరించే వారు. జైపాల్ రెడ్డి రాజకీయ వారసత్వం ఉన్నా సొంతంగానే ఎదగడానికి ప్రయత్నించారు. ఇక 2001లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితినే నేడు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అప్పట్లో సిద్దిపేట ఓటమి తర్వాత తాను చాలా గుణపాఠాలు నేర్చుకున్నాని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పలు అంతరంగిక సంభాషణల్లో పేర్కొనేవారు. ప్రస్తుతం హుజరాబాద్ లో దారుణమైన ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి కూడా చాలా పరిణతి చెందారు. ఏకకాలంలో అట కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నారు. కెసిఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో సుమారు మూడు లక్షల జన సమీకరణతో నిరుద్యోగ సైరన్ పేరుతో సభ నిర్వహించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక రాహుల్ గాంధీని వరంగల్ కు తీసుకువచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరుతో కని విని ఎరుగని స్థాయిలో సభ నిర్వహించారు. ఇక ఈ సభ నుంచే కాంగ్రెస్ పుంజుకుంది. ఏకంగా అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులకు గాలం వేస్తూ తమ పార్టీలోకి చేర్చుకుంటున్నది.
ఎలా అధిగమిస్తారు
ఏ మాటకు ఆ మాటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటికంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. బయట వాళ్ళ కంటే సొంత పార్టీ నేతలే తమపై తాము విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఒకరు ఎదగకుండా ఇంకొకరు కాళ్లల్లో కట్టెలు పెడుతూ ఉంటారు. ఇందుకు రేవంత్ రెడ్డి కూడా అతీతుడు ఏమీ కాదు. టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్న రేవంత్ ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఏకంగా రాహుల్ గాంధీకి, సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. ఇక వి హనుమంతరావు అయితే రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు దిగేవారు. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు కాకుండా దాదాపు నాలుగు నెలలపాటు బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు నిలువరించగలిగారు. కానీ రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి.. సభలు, సమావేశాల ఖర్చు కూడా తానే భరిస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రథమ లక్ష్యంగా భావిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీలోనే నాయకులు అడ్డు తగులుతున్నారు. మరీ ముఖ్యంగా జగ్గారెడ్డి, హనుమంతరావు, కోమటిరెడ్డి సోదరులు, భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, జానా రెడ్డి వంటి వారు తలనొప్పిగా మారారు. ఇటీవల యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ చేపట్టినప్పుడు దానికి వెళ్లకూడదని కాంగ్రెస్ నాయకులు తీర్మానించారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆ కార్యక్రమానికి వెళ్లి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ధిక్కరించారు. పైగా రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చాడంటూ విమర్శించారు. దీనికి నోచుకున్న రేవంత్ రెడ్డి హనుమంతరావును బండకేసి కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి వస్తారా?
రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఆ గ్యాప్ ను క్యాచ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ తరచూ విఫలమవుతోంది. దుబ్బాక, జిహెచ్ఎంసి, హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ షాట్ ఇచ్చిన బిజెపి ఇప్పుడు రెండో స్థానం కోసం పోటీ పడుతోంది. కాంగ్రెస్ వరంగల్ సభకు రాహుల్ గాంధీని తీసుకొస్తే, బీజేపీ ప్రధానమంత్రి మోదిని ఏకంగా మూడుసార్లు తీసుకొచ్చింది. జేపీ నడ్డా, అమిత్ షా ఇందుకు అదనం. అయితే తన పార్టీలోకి చేరికలు ఉంటాయని బిజెపి నాయకులు చెబుతున్నా.. అధికార పార్టీ నాయకులకు గాలం వేసి కాంగ్రెస్ లో చేర్పించడంలో రేవంత్ రెడ్డి నూటికి నూరుపాళ్ళు విజయవంతమయ్యారు. దీనినే ఉదాహరణగా చూపి ప్రజల్లోకి వెళ్లేందుకు ఉత్సాహపడుతున్నారు. క్రమంలో తన కాళ్ళలో పుల్లలు పెడుతున్న సీనియర్ కు గట్టిగానే కౌంటర్లు ఇస్తూ.. పాదయాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. ఒకవేళ గనుక రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టి అదే ఉప్పులో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మరో రాజశేఖరరెడ్డి కచ్చితంగా అవుతారు. కానీ ఇందుకు ఆ పార్టీలోని సీనియర్ నాయకులు ఎంత మేరకు సహకరిస్తారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. వైపు తమకు తెలియకుండానే ఇతర పార్టీల నుంచి నాయకుల్ని కాంగ్రెస్ లోకి ఎలా తీసుకొస్తారని సొంత పార్టీ నేతలు రేవంత్ ను విమర్శిస్తున్నారు. వారికి సీనియర్ నాయకులు కూడా స్వరం కలపడంతో కాంగ్రెస్లో ఏం జరుగుతుందో అంతు పట్టకుండా ఉంది.
Also Read:YCP Plenary: తొలి ప్లీనరీ.. వైసీపీ రాజ్యాంగంలో ‘రాజు’ జగన్..?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Telangana politics will revanth reddy be another rajasekhar reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com