యాదాద్రి: బాలిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

యాదాద్రి భువనగిరి జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన మూడేళ్ల బాలికను పోలీసులు రక్షించారు. కిడ్నాపర్ల చెర నుంచి బాలికను తీసుకొని తల్లి మహేశ్వరికి అప్పగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. భర్త కోసం మహేశ్వరి మూడేళ్ల కూతురిని వెంటబెట్టుకొని సోమవారం  హైదరాబద్‌కు వెళ్లింది. ఎంజీబీఎస్‌లో మహేశ్వరికి కొందరు మాయమాటలు చెప్పి మత్తుమందును కలిపిన కూల్‌డ్రింగ్స్‌ను తాగించారు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో కూతురిని భువనగిరికి తీసుకొచ్చారు.స్పృహ […]

Written By: Suresh, Updated On : October 20, 2020 9:27 am
Follow us on

యాదాద్రి భువనగిరి జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన మూడేళ్ల బాలికను పోలీసులు రక్షించారు. కిడ్నాపర్ల చెర నుంచి బాలికను తీసుకొని తల్లి మహేశ్వరికి అప్పగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. భర్త కోసం మహేశ్వరి మూడేళ్ల కూతురిని వెంటబెట్టుకొని సోమవారం  హైదరాబద్‌కు వెళ్లింది. ఎంజీబీఎస్‌లో మహేశ్వరికి కొందరు మాయమాటలు చెప్పి మత్తుమందును కలిపిన కూల్‌డ్రింగ్స్‌ను తాగించారు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో కూతురిని భువనగిరికి తీసుకొచ్చారు.స్పృహ లోకి వచ్చిన మహేశ్వరి జరిగినదంతా  పోలీసులకు చెప్పింది. దీంతో సీఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో కిడ్నాప్‌ కేసును ఛేదించారు. బాలికను కిడ్నాప్‌ చేసిన వారిలో మంగళవారం ఒకరిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు.