
రైతుల ఉద్యమంపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు? టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఢిల్లీకి వచ్చిన కేసీఆర్.. రైతులను ఎందుకు కలవలేదని నిలదీశారు. కేసీఆర్ రైతుల పక్షపాతి అయితే.. మీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర పెద్దల ముందు కేసీఆర్ మోకరిల్లారని ఎద్దేవాచేశారు. బీజేపీ ఎందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుతోంది? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదని, బీజేపీ నేతలకు దమ్ముంటే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.