
ఆస్తుల క్రయవిక్రయాలు పారదర్శకంగా జరగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సులువైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసమే మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్‌కమిటీ) ఏర్పాటైందని చెప్పారు. బీఆర్కే భవన్‌లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై రిజిస్ట్రేషన్లలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించింది. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులను మూడు విభాగాలు విభజించి సమస్యలను అధిగమిస్తామని చెప్పారు. రద్దీగా ఉన్న కార్యాలయాల్లో ఎక్కువ మంది సిబ్బందితో రిజిస్ట్రేషన్లు చేపడతామన్నారు.