ఏపీ హైకోర్టు సీజేను సిక్కింకు మార్చుతున్నారా?

సుప్రీం కోర్టు కోలీజియం సమావేశమై ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా దేశంలోని ఎనిమిది రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను మార్చడానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే న్యూ ఢిల్లీ నుంచి వస్తున్న నివేదికలు నిజమైతే ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జె కె మహేశ్వరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఒకటి లేదా రెండు రోజుల్లో కొత్త ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారని ప్రచారం సాగుతోంది. Also Read: హోం లోన్ […]

Written By: NARESH, Updated On : December 15, 2020 8:27 pm
Follow us on

సుప్రీం కోర్టు కోలీజియం సమావేశమై ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా దేశంలోని ఎనిమిది రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను మార్చడానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే న్యూ ఢిల్లీ నుంచి వస్తున్న నివేదికలు నిజమైతే ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జె కె మహేశ్వరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఒకటి లేదా రెండు రోజుల్లో కొత్త ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారని ప్రచారం సాగుతోంది.

Also Read: హోం లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. లక్షన్నర పన్ను మినహాయింపు..?

జెకె మహేశ్వరి స్థానంలో మరో సీనియర్ జడ్జి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి నియమితులవుతున్నారని సమాచారం. ప్రస్తుతం జస్టిస్ గోస్వామి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ మహేశ్వరి నియమితులవుతారని అంటున్నారు.. ఒక విధంగా, ఇది పరస్పర బదిలీ అన్న చర్చ సాగుతోంది.

ఢిల్లీలో సోమవారం సమావేశమైన సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి వీరు సిఫార్సులు చేశారని అవి బయటకు వచ్చినట్టు సమాచారం.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీని తెలంగాణ సిజెగా నియమిస్తారని తెలిసింది. జస్టిస్ మహేశ్వరిని సిక్కింకు, సిక్కిం జస్టిస్ గోస్వామిని ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తారని ఢిల్లీ నుండి వెలువడుతున్న నివేదికలు చెబుతున్నారు.

Also Read: సీఎం జగన్ సడెన్ ఢిల్లీ టూర్ వెనుక కారణమదే?

ఇక ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరిని ఆంధ్రప్రదేశ్ నుంచి బదిలీ చేయడం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనపై జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశాడు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతికూల తీర్పులు ఇచ్చాడని లేఖలో ఆరోపించిన సంగతి తెలిసిందే. తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూచనలను ఏపీ చీఫ్ జస్టిస్ మహేశ్వరి అనుసరిస్తున్నారని ఆరోపిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బొబ్డేకు రాసిన లేఖను కూడా జగన్ గతంలో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. మరి ఈ బదిలీ నేపథ్యంలో ఏపీ చీఫ్ జస్టిస్ బదిలీ జగన్ రాసిన లేఖ ప్రకారమే జరుగుతుందా? లేక యాధృశ్చికమా అన్నది ఖచ్చితంగా తెలియదు. దీనిపై మీడియా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్