తెలుగు సినిమా రంగంలో చిరంజీవి స్థానం అందరికీ తెలిసిందే. సినిమా గురించి చెప్పాలంటే చిరంజీవికి ముందు తర్వాత అన్నంతలా ఆయన ఎదిగారు. కానీ, రాజకీయాల్లో రాణించలేకపోయారు. చిరంజీవి కన్నా ముందు ఎన్టీఆర్ సక్సెస్ అయినప్పటికే అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పటి రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకున్న ఎన్టీఆర్ సీఎం పీఠం ఎక్కగలిగారు. అయితే ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఆయన తమ్ముడు యాక్టివ్‌గా ఉన్నాడు. కానీ, సినిమా స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాడు.
Also Read: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. కోనసీమకు శాపం..
చిరంజీవికి అవకాశాలు ఉన్నా..
చిత్ర పరిశ్రమే కాదు రాజకీయాల్లోనూ ఎన్టీయార్ రాజకీయాల్లోనూ నంబర్ వన్ అనిపించుకున్నాడు. సినిమాల్లో ఆయన తర్వాత ఆ స్థాయిని అందుకున్న చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. బలమైన కుల నేపథ్యం, పల్లెదాకా విస్తరించిన ఫ్యాన్స్ ఉన్నా.. సక్సెస్ కాలేకపోయాడు. అనంతరం పార్టీని భారంగానే భావించిన చిరంజీవి కేంద్ర మంత్రి పదవి తీసుకొని కాంగ్రెస్‌లో కలిపేశాడు.
స్థిరత్వం లేని పవన్
చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లో ప్రవేశించిన పవన్ కళ్యాణ్.. అన్నయ్య పార్టీని కాంగ్రెస్‌లో కలపడం నచ్చక సొంత పార్టీ పెట్టాడు. జనసేన స్థాపించి ఏడేళ్లు అవుతున్నా.. బాలారిష్టాలు దాటడం లేదు. ఎమ్మెల్యే రాపాక తప్ప ఆ పార్టీకి ప్రజాప్రతినిధులే లేరు. ఆయన కూడా జగన్‌తో టచ్‌లో ఉంటున్నాడు. పవన్‌కు దూకుడు ఉన్నా స్థిరత్వం లేకపోవడంతో సక్సెస్ చూడలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొదట బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చిన ఆయన.. తర్వాత వారి నుంచి విడిపోయాడు. కొన్నాళ్లు లెఫ్ట్ పార్టీలతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేశాడు. అనంతరం మళ్లీ బీజేపీతో మద్దతు పెట్టుకున్నాడు. ఇలా నిలకడ లేకపోవడంతో పార్టీ క్యాడర్ కూడా అసంతృప్తితోనే ఉన్నది.
Also Read: నివర్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని దీక్షకు దిగిన జనసేనాని..!
సినీ ఇండస్ట్రీ మద్దతు లేదు
ఎన్టీఆర్‌కే కాదు చిరంజీవికి కూడా సినీ ఇండస్ట్రీ మద్దతు ఇచ్చింది. పవన్ పరిస్థితి అలా లేదు. ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్లు సపోర్ట్ చేయడం లేదు. అంతేకాదు ఎవరైనా విమర్శలు చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ రియాక్ట్ కావడం కూడా మైనస్‌గా మారుతోంది. ఇటీవల ప్రకాశ్ రాజు పవన్ ఉద్దేశించి.. ఊసరవెళ్లిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించడంతో నాగబాబు తీవ్రంగా స్పందించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బండారం బయటపెట్టాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు తట్టుకునే శక్తి ఉండాలని, ప్రతిదానికి రియాక్ట్ కావడం పార్టీకి మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్