వ్యర్థాలు రీసైక్లింగ్‌ అద్భుతం: కేటీఆర్‌

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రీజైక్లింగ్‌ ప్లాంటుఫై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ప్రశంసలు కురిపించారు. మనం పారవేసే చెత్తను రీసైక్లింగ్‌ చేయడం మంచి కాన్సెప్ట్‌ అని కొనియాడారు. నగరంలోని జీడిమెట్లలో రీసైక్లింగ్‌ ప్లాంటును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్భీనరగ్‌ ఫతుల్‌ గూడలో సంక్రాంతి రోజున మరో ప్లాంటును ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌లో రోజుకు 2 వేల టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని, అలాంటి వాటిని రీసైక్లింగ్‌ చేయడం అద్భుతమైన ప్రక్రియ అన్నారు. […]

Written By: Suresh, Updated On : November 7, 2020 12:41 pm
Follow us on

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రీజైక్లింగ్‌ ప్లాంటుఫై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ప్రశంసలు కురిపించారు. మనం పారవేసే చెత్తను రీసైక్లింగ్‌ చేయడం మంచి కాన్సెప్ట్‌ అని కొనియాడారు. నగరంలోని జీడిమెట్లలో రీసైక్లింగ్‌ ప్లాంటును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్భీనరగ్‌ ఫతుల్‌ గూడలో సంక్రాంతి రోజున మరో ప్లాంటును ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌లో రోజుకు 2 వేల టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని, అలాంటి వాటిని రీసైక్లింగ్‌ చేయడం అద్భుతమైన ప్రక్రియ అన్నారు. మున్సిపల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో జీహెచ్‌ఎంసీ పనితీరు మెరుగ్గా ఉందన్నారు. వ్యర్థాలు ప్రజలకు హానికరంగా మారకుండా చర్యలు తీసుకుంటామని ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు.