https://oktelugu.com/

టీడీపీకి షాకిచ్చిన మాజీ ఎంపీ.. వైసీపీలోకి.. కారణం అదేనా?

రాజకీయాల్లో శత్రుత్వమైనా.. మిత్రుత్వమైనా అది రాజకీయాల వరకే. శాశ్వత మిత్రులుండరు.. శాశ్వత శత్రువులూ ఉండరనేది కూడా చాలా సార్లు రుజువైంది. ప్రస్తుతం ఉన్న పార్టీలో ప్రధాన్యత తగ్గిపోవడమో.. టికెట్ దక్కకపోవడంతోనో పార్టీలు జంప్‌ చేస్తుంటారు. అంతేకాదు.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలు ఫ్యూచర్‌‌ ఉండదనుకొని అధికార పక్షంలోకి చేరుతుంటారు. అలాంటి సందర్భాలు కూడా చాలానే చూస్తుంటాం. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా ఎక్కువ. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 01:34 PM IST
    Follow us on

    రాజకీయాల్లో శత్రుత్వమైనా.. మిత్రుత్వమైనా అది రాజకీయాల వరకే. శాశ్వత మిత్రులుండరు.. శాశ్వత శత్రువులూ ఉండరనేది కూడా చాలా సార్లు రుజువైంది. ప్రస్తుతం ఉన్న పార్టీలో ప్రధాన్యత తగ్గిపోవడమో.. టికెట్ దక్కకపోవడంతోనో పార్టీలు జంప్‌ చేస్తుంటారు. అంతేకాదు.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలు ఫ్యూచర్‌‌ ఉండదనుకొని అధికార పక్షంలోకి చేరుతుంటారు. అలాంటి సందర్భాలు కూడా చాలానే చూస్తుంటాం. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా ఎక్కువ.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కీలక నేత టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా 2014లో టీడీపీకి కంచుకోటగా నిలిచిన జిల్లా. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ 15 స్థానాలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఏలూరు ఎంపీగా మాగంటి బాబు టీడీపీ నుంచి విజయం సాధించారు. అంతకుముందు కాంగ్రెస్‌లో కొనసాగిన మాగంటి బాబు.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన మాగంటి బాబు ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఫ్యాన్‌ గాలికి టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. దీంతో ఏలూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసిన మాగంటి బాబు కూడా ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి పెద్దగా యాక్టివ్‌గా లేరు.

    Also Read: ఇంతకీ జగన్ చేస్తున్నది తప్పా? ఒప్పా?

    ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ పదవులను ప్రకటించారు. ఆ కార్యవర్గంలో పశ్చిమగోదావరి జిల్లాకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. దీనికితోడు టీడీపీకి చంద్రబాబుకు ఎంతో సన్నిహితంగా మెలిగిన మాగంటి బాబును కూడా పక్కన పెట్టారు. దీంతో మాగంటి బాబు అలకపాన్పు ఎక్కినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు చంద్రబాబు కనీసం మాగంటి పేరును పరిగణలోకి కూడా తీసుకోకపోవడంతో ఒకింత ఆవేదనకు అసంతృప్తికి గురైనట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో కాకపోయినప్పటికీ కనీసం జిల్లా స్థాయి పదవి కూడా అప్పగించకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

    Also Read: ఏపీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితా?

    2019 ఎన్నికల్లో తనతోపాటే చాలా మంది వరకు ఓటమి పాలయ్యారని.. మరి తనను మాత్రమే ఎందుకు పక్కనపెట్టారనేది మాగంటి బాబు వేస్తున్న ప్రశ్న. పార్టీకి ఎంతో విధేయతతో ఉన్నప్పటికీ తనను దూరం పెట్టాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చిందంటూ సన్నిహితుల వద్ద మాగంటి బాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడిగా గన్ని వీరాంజనేయులును నియమించడంపైనా మాగంటి అసంతృప్తిలో ఉన్నాడు. అందుకే.. పార్టీని వీడబోతున్నారనేది ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.