https://oktelugu.com/

మోడీ పిలుపునకు బీహార్‌ లో ఓట్లు రాలుతాయా?

‘ఇది లాస్ట్ టైం.. నితీష్ ను నాలుగోసారి సీఎం చేయండి.. ఆయన వచ్చేసారి ఎన్నికల నుంచి తప్పుకుంటున్నాడు.. గెలిపించండి’ అంటూ బీహారీలకు సెంటిమెంట్ తో యాంటిమెంట్ పూసేలా ప్రధాని మోడీ రాజకీయ ప్రచారం చేస్తున్నారు. బీహార్‌‌లో ఈ రోజు చివరి విడత పోలింగ్ జరుగుతోంది.. నేడు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు ఆసక్తికర పిలుపులు ఇచ్చారు. మరి మోడీ పిలుపునకు ఓట్లు రాలుతాయా లేదా అన్నది ఫలితాల రోజు తేలనుంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 12:35 PM IST
    Follow us on

    ‘ఇది లాస్ట్ టైం.. నితీష్ ను నాలుగోసారి సీఎం చేయండి.. ఆయన వచ్చేసారి ఎన్నికల నుంచి తప్పుకుంటున్నాడు.. గెలిపించండి’ అంటూ బీహారీలకు సెంటిమెంట్ తో యాంటిమెంట్ పూసేలా ప్రధాని మోడీ రాజకీయ ప్రచారం చేస్తున్నారు. బీహార్‌‌లో ఈ రోజు చివరి విడత పోలింగ్ జరుగుతోంది.. నేడు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు ఆసక్తికర పిలుపులు ఇచ్చారు. మరి మోడీ పిలుపునకు ఓట్లు రాలుతాయా లేదా అన్నది ఫలితాల రోజు తేలనుంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    బీహార్‌‌ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా నడుస్తోంది. ఇప్పటికే తొలి దశ, రెండో ఎన్నికలు ముగియగా.. నేడు మూడో దశ పోలింగ్‌ నడుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 71 స్థానాల్లో తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. సెకండ్‌ ఫేస్‌లో మరో 94 నియోజకవర్గాలకు, మూడో విడత పోలింగ్‌ 78 నియోజకవర్గాల్లో జరుగుతోంది.

    Also Read: గెలుపు లాంఛనమే: వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనున్న బైడెన్‌..!

    బీహారీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని కొత్త రికార్డు సృష్టించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం ట్వీట్ చేశారు. ‘బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో మూడో మరియు చివరి దశ పోలింగ్‌లో ఓటర్లందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని కొత్త రికార్డు సృష్టించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు . అందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం నిబంధనలు పాటించి కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

    ఎన్డీయే కూటమి విజయం కోసం ప్రసంగించిన మోడీ.. ప్రజలు మళ్లీ ఎన్డీఏను ఎన్నుకుంటామని ధీమా వ్యక్తం చేశారు . నితీశ్ కుమార్ – బీజేపీ జేడీయూ భాగస్వామ్యంతో ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవిని కట్టబెట్టాలని అభ్యర్థించారు. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ నితీష్ కుమార్‌తో వేదికను పంచుకున్నారు. 15 జిల్లాల్లో ఉన్న 2.3 కోట్లకు పైగా ఓటర్లు ఈ రోజు ఓటు వేయడానికి బారులు తీరుతున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, మావోయిస్టు దెబ్బతిన్న ప్రాంతాలలో మినహా పోలింగ్ సమయాన్ని ఒక గంట పొడిగించారు. మరోవైపు ఈ ఎన్నికలే తనకు చివరివి అంటూ ఇప్పటికే నితీశ్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబెడుతారా అని ఆసక్తి నెలకొంది.

    Also Read: ధనిక రాష్ట్రం తెలంగాణ బడ్జెట్ ఇంతేనా?

    మరోవైపు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా కూడా బీహార్‌‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు. ‘నేడు బీహార్‌లో చివరి దశ ఓటింగ్ జరుగుతోంది. కోవిడ్ యొక్క జాగ్రత్తలను దృష్టిలో ఉంచుకుని బీహార్ పురోగతికి సాధ్యమైనంతవరకు ఓటు వేయడం ద్వారా ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను’ అంటూ బీజేపీ నడ్డా పిలుపునిచ్చారు.