ముందుగా వైద్యులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరాం: మంత్రి ఈటల

భారత్ లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా వైద్యులు, పారశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఖైరతాబాద్ లోని బస్తీ దవాఖానను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్ లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందన్న వార్తలపై కేంద్రమంత్రిని అడిగామన్నారు. ఒకవేళ అందుబాటులోకి వస్తే పేద ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కోరామన్నారు. ఇప్పటికే తెలంగాణలోకి పరోక్షంగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా వ్యాక్సిన్ […]

Written By: Suresh, Updated On : November 12, 2020 12:23 pm
Follow us on


భారత్ లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా వైద్యులు, పారశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఖైరతాబాద్ లోని బస్తీ దవాఖానను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్ లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందన్న వార్తలపై కేంద్రమంత్రిని అడిగామన్నారు. ఒకవేళ అందుబాటులోకి వస్తే పేద ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కోరామన్నారు. ఇప్పటికే తెలంగాణలోకి పరోక్షంగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా వ్యాక్సిన్ రాలేదని చెప్పారు.