
తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా తెలంగాణలో అపశృతి చోటు చేసుకుంది. పుణ్యస్నానానికి వెళ్లి ఇద్దరు మ్రుతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల వద్ద పుష్కర స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలికలు నీట మునిగారు. గొందిమల్ల గ్రామానికి చెందిన మైథిలి, కర్నూలుకు చెందిన దీక్షితలు ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మరణించారు. దీంతో వారి మ్రుతదేహాలను అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత నెల 20న ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. 12 రోజులపాటు ప్రశాంతంగా సాగిన పుష్కర స్నానాలు చివరి రోజు ఇద్దరు బాలికలు మరణించడం విషాదంగా మారింది. పుష్కరాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.