
హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఇవాళ బంజారాహిల్స్‌లోని బీఎస్‌జీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఓటేశారు. హైదరాబాదీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఓటు కలిగి ఉండడం ఓ హక్కు అని, మీరు ఓటు వేయని పక్షంలో, మీకు ప్రశ్నించే అవకాశం ఉండదని ఆమె అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేశానని, మీరు కూడా వచ్చి ఓటు వేయాలని ఆమె తన ట్వీట్‌లో కోరారు. హైదరాబాద్ నగర అభివృద్ధి చూసి ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు.