ఎల్‌ఆర్‌ఎస్‌పై నేడు విచారణ

భూముల క్రమబద్ధీకరణపై టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ కార్యక్రమంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టులో గురువారం కౌంటర్‌ దాఖలు చేయనుంది. భూముల క్రమబద్దీకరణ కోసం ప్రజలు తమ భూములను ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోవాలని తెలిపింది. ఇందుకోసం గతనెల 31 వరకు గడువు విధించింది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌తో పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు ఇదే అంశంపై ఫోరమ్‌ ఫర్‌ […]

Written By: Suresh, Updated On : November 5, 2020 9:17 am
Follow us on

భూముల క్రమబద్ధీకరణపై టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ కార్యక్రమంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టులో గురువారం కౌంటర్‌ దాఖలు చేయనుంది. భూముల క్రమబద్దీకరణ కోసం ప్రజలు తమ భూములను ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోవాలని తెలిపింది. ఇందుకోసం గతనెల 31 వరకు గడువు విధించింది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌తో పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు ఇదే అంశంపై ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనుంది.