https://oktelugu.com/

తిరుపతి పార్లమెంట్‌పై ముగ్గురి గురి..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి పార్లమెంట్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌తో పాటు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఈ స్థానం మళ్లీ వైసీపీకే దక్కుతుందని అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా వైసీపీ కూడా బల్లి దుర్గాప్రసాదరావు తనయుడు కళ్యాణ్‌ చక్రవర్తి పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తండ్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 9:39 am
    Follow us on

    Tirupati Parliament

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి పార్లమెంట్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌తో పాటు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఈ స్థానం మళ్లీ వైసీపీకే దక్కుతుందని అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా వైసీపీ కూడా బల్లి దుర్గాప్రసాదరావు తనయుడు కళ్యాణ్‌ చక్రవర్తి పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తండ్రి మరణించడంతో తనయుడికే టికెట్‌ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. దీంతో సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇక ఈ నియోజకవర్గంలో టీడీపీ కూడా పోటికి నిలబడాలని ప్రయత్నిస్తోంది. చాలా రోజుల తరువాత జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి పోటీలో లేకపోతే తమ ఉనికిని కోల్పోతామని అనుకుంటోంది. అందువల్ల తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో టీడీపీ బరిలో ఉండడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఇక్కడ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. ఒకవేళ చివరి వరకు చూసి పనబాక లక్ష్మి ఆమె అంగీకరించకపోతే వర్ల రామయ్యకు టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    Also Read: ఏపీలో పాఠశాలలో కరోనా కలకలం.. టెన్షన్ లో విద్యార్థులు..?

    తిరుపతి పార్లమెంట్‌ కనుక ఇక్కడ గెలిస్తే ప్రయోజనాలుంటాయని అనుకుంటున్న బీజేపీ, జనసేనలు కలిసి ఇక్కడ పోటీకి దిగాలని చూస్తున్నాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి బీజేపీ రాష్ట్రంలో పట్టు సాధిస్తోంది. పలు పోరాట కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అంతేకాకుండా తిరుపతి పార్లమెంట్‌ లో గుడులు గోపురాలు ఆధ్యాత్మికత ఎక్కువ. హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీకి ఇక్కడ అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడి నుంచి ఒక్క సీటైనా గెలిస్తే పరువు దక్కుతుందని ఆలోచిస్తోంది. అయితే అభ్యర్థి ఎవరనేది ఇంకా కొలక్కి రాలేదు.

    Also Read: స్థానిక ఎన్నికలకు వైసీపీ నై.. టీడీపీ సై..కారణమేంటి?

    దీంతో తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో మూడుపార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అధికార వైసీపీ తాను చేపట్టే సంక్షేమ పథకాలతో పాటు మరో పార్లమెంట్‌ సీటు గెలిస్తే కేంద్రంలో మరింత కీలకమవుతామని ప్రచారం చేయడానికి సిద్ధమవుతోంది. ఇక టీడీపీకి అంతకుముందు పట్టున్న నియోజకవర్గం కాబట్టి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ ఎలాగైనా స్థానాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కోసం సోము వీర్రాజు ఇప్పటికే కొందరి దగ్గరి నుంచి సమాచారం సేకరిస్తున్నాడట.