
త్వరలో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వలసలు మొదలయ్యాయి. తాజాగా ఎల్బీ నగర్ టీఆర్ఎస్ నాయకుడు జిట్టా సురేందర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు ఎంపీ రేవంత్ రెడ్డి అనుచరుడు కొప్పుల నరసింహారెడ్డి బీజేపీలోకి మారారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీలోని సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే దుబ్బాకలో బీజేపీ విజయం సాధించాక ఆ పార్టీ వైపు టీఆర్ఎస్ నేతలు వలస వెళ్తున్నట్లు తెలుస్తోంది.