
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వహించే సిబ్బందికి మంగళవారం ఎన్నికల అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మళ్లీ 2 గంటల నుంచి 4 వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణకు పీవో, ఏపీవోలు హాజరవుతారన్నారు. 21వేల మంది సిబ్బందికి 166 మాస్టర్ ట్రైనీలు శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చర్యలుంటాయన్నారు. అయితే నేడు శిక్షణకు హాజరుకాలేని వారు రేపు రావచ్చన్నారు. కాగా డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ పోలింగ్ నిర్వహించనున్నారు.