https://oktelugu.com/

‘వకీల్ సాబ్’కు గ్రాండ్ వెల్ కమ్.. వసూళ్లకు ఢోకా లేదా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. పవన్ కల్యాణ్ చివరగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ 2018 జనవరి 10న విడుదలైంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇక ఆయన సినిమాలకు దూరంగా ఉంటారని అందరూ భావించారు. అయితే అనుహ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిలాగే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. Also Read: ‘వకీల్ సాబ్’కు గ్రాండ్ వెల్ కమ్.. వసూళ్లకు ఢోకా లేదా? పవర్ స్టార్ […]

Written By: , Updated On : November 24, 2020 / 09:46 AM IST
Follow us on

Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. పవన్ కల్యాణ్ చివరగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ 2018 జనవరి 10న విడుదలైంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇక ఆయన సినిమాలకు దూరంగా ఉంటారని అందరూ భావించారు. అయితే అనుహ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిలాగే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

Also Read: ‘వకీల్ సాబ్’కు గ్రాండ్ వెల్ కమ్.. వసూళ్లకు ఢోకా లేదా?

పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీగా బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘పింక్’ను తెలుగులో ‘వకీల్ సాబ్’గా తెరకెక్కిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు.. శ్రీదేవి భర్త బోనికపూర్ ‘వకీల్ సాబ్’ ను నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా అంజలి.. అనన్య..నివేథా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యమైంది. లేకపోతే ఈపాటికే ‘వకీల్ సాబ్’ థియేటర్లలో సందడి చేసేది. ఇటీవల ‘వకీల్ సాబ్’ రీ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభంకాగా సంక్రాంతి రేసులో ఈ మూవీ ఉంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రోజులో ఎన్ని షోలైన వేసుకోవచ్చని.. అలాగే టికెట్ ధరను ఆయా సినిమా డిమాండ్ ను బట్టి పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయమే త్వరలో తీసుకోనుందని సమాచారం.

Also Read: ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ రైట్స్ ఎవరికి.?

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో టికెట్ల రేట్లు పెంచడం చిన్న సినిమాలకు శాపంగా మారనుంది. అయితే సినిమా డిమాండ్ ను బట్టి పెంచుకునే వెసులుబాటు ఉన్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ మూవీ రానుండటంతో ఈ మూవీకి భారీగా డిమాండ్ ఉండనుంది. ఈ నేపథ్యంలో టికెట్ల రేట్లు పెంచితే మాత్రం ‘వకీల్ సాబ్’ టాలీవుడ్ వకీల్ సాబ్ గా మారడం ఖాయంగా కన్పిస్తోంది. ‘వకీల్ సాబ్’ కు పరిస్థితులు కలిసి వస్తుండటంతో నిర్మాత దిల్ రాజుతోపాటు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్