
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇవాళ తెల్లవారుజామున పినపాక మండలంలోని ఏడుళ్లబయ్యారంలోకి చొరబడిన దుండగులు.. ఎనిమిది ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో మహిళ మెడలో గొలుసును లాక్కెళ్లారు. దీంతోపాటు సుమారు రూ.5 లక్షల విలువైన నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈఘటనలో పది మంది పాల్గొన్నారని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.