
నీరా పాలసీపై ఆబ్కారి, పర్యాటకశాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం రవీంద్రభారతిలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీరా, దాని అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనవనంలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు తయారీ, నిర్మాణ సంబంధిత టెండర్ ప్రక్రియ, ఇతర అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భేటీలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖలో బదిలీలు, పదోన్నతులపై మంత్రి చర్చించారు. పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి కొత్త సంవత్సరంలో అందరికీ పోస్టింగులూ ఇవ్వాలన్నారు.