
తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన లాసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను ప్రకటించారు. మొత్తం సెట్‌లో 78.60 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఐదేళ్ల కోర్సుకు నిర్వహించిన సెట్‌లో 62.35 శాతం, మూడేళ్ల కోర్సు సెట్‌లో 91.04 శాతం ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఐదేళ్ల కోర్సు లా సెట్‌లో పాంచజన్య, మూడేళ్ల సెట్‌లో సీహెచ్ స్నేహశ్రీ మొదటి ర్యాంకులు సాధించారు.