రాంగోపాల్ వర్మకు తెలంగాణ కోర్టు నోటీసులు

‘దిశ ఎన్ కౌంటర్’సినిమాపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాను నిలిపివేయాలని దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమ కుమారులు ఎన్ కౌంటర్ లో మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని, ఇప్పుడు మళ్లీ సినిమాలో వారిని దోషులుగా చూపించే ప్రయత్నం చేయడంతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతారని నిందితుల కుటుంబ సభ్యుల తరుపున న్యాయవాది క్రుష్ణమూర్తి కోర్టుకు […]

Written By: Suresh, Updated On : November 24, 2020 3:43 pm
Follow us on

‘దిశ ఎన్ కౌంటర్’సినిమాపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాను నిలిపివేయాలని దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమ కుమారులు ఎన్ కౌంటర్ లో మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని, ఇప్పుడు మళ్లీ సినిమాలో వారిని దోషులుగా చూపించే ప్రయత్నం చేయడంతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతారని నిందితుల కుటుంబ సభ్యుల తరుపున న్యాయవాది క్రుష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. ఇప్పడు ఈ చిత్రాన్ని నిర్మించి  వారిని ఊరిలో ఉండనివ్వకుండా చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆయన చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరాడు. దీంతో కోర్టు రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపుతూ తదుపలి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.