
గౌతు లచ్చన్నపై మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘గౌతు లచ్చన్నపై మంత్రి సీదిరి వ్యాఖ్యలు హేయం. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే మంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటాం. చదువుకున్న మూర్ఖుల్లా వైసీపీ నేతల వ్యవహారం. మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం హేయం. సీదిరి అప్పలరాజు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అప్పలరాజు కార్యక్రమాలను అడ్డుకుంటాం. సీదిరి ఇంకా మంత్రిగా ఉండడం సిగ్గుచేటు. వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డికి భజన చేసుకోండి. లచ్చన్న గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదు. వంద మంది జగన్ రెడ్డిలు వచ్చినా లచ్చన్న విగ్రహం పెయింట్ కూడా పీకలేరు’ అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.