
టీచర్ల డిమాండ్లన్నీ న్యాయమైనవని.. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించాలని ఇందిరా పార్కు వద్ద టీచర్లు మంగళవారం ధర్నా తలపెట్టారు. ఈ ధర్నాకు వస్తున్న టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. టీచర్ల అరెస్ట్‌ను కోదండరాం ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్లాస్ రూంలో ఉండాల్సిన టీచర్.. పోలీస్ స్టేషన్లో ఉండడమంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయ్యాలని డిమాండ్ చేశారు. అనధికారికంగా దాదాపుగా 25 వేల ఖాళీలు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు.