
ఆంక్షల పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సీఎండీకి ఆయన లేఖ రాశారు. పత్తి కొనుగోలుకు ప్రస్తుతం సీజన్ నడుస్తున్నందున రోజువారీ గరిష్ఠ పరిమితి తొలగించి.. మార్కెట్‌కు వస్తున్న మొత్తం పత్తిని కొనుగోలు చేయాలని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కీలక సమయమని.. ఆంక్షలు విధించడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని లేఖలో ఆయన పేర్కొన్నారు.