https://oktelugu.com/

జగనన్న ఇల్లు ఎంతో తెలుసా..?

ఏపీలో ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దనేది అక్కడి సీఎం జగన్‌ ప్రధాన టార్గెట్‌. ఇందుకుగాను ఏపీ సర్కార్‌‌ 30 లక్షల ఇళ్లను నిర్మిస్తోంది. ఈ మేరకు క్రిస్మస్ రోజున ఇళ్ల పత్రాలు కూడా పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణం కూడా నిన్నటి రోజునే ప్రారంభిస్తామని ప్రకటనలు చేసింది కానీ ఎక్కడా ప్రారంభించిన దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వం .. లబ్ధిదారులకు ఓ ఆఫర్ ఇచ్చింది. మూడు ఆప్షన్స్ ఇచ్చి ఎంచుకోమని కోరింది. అందులో మొదటి రెండు లబ్ధిదారులకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 26, 2020 / 12:36 PM IST
    Follow us on


    ఏపీలో ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దనేది అక్కడి సీఎం జగన్‌ ప్రధాన టార్గెట్‌. ఇందుకుగాను ఏపీ సర్కార్‌‌ 30 లక్షల ఇళ్లను నిర్మిస్తోంది. ఈ మేరకు క్రిస్మస్ రోజున ఇళ్ల పత్రాలు కూడా పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణం కూడా నిన్నటి రోజునే ప్రారంభిస్తామని ప్రకటనలు చేసింది కానీ ఎక్కడా ప్రారంభించిన దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వం .. లబ్ధిదారులకు ఓ ఆఫర్ ఇచ్చింది. మూడు ఆప్షన్స్ ఇచ్చి ఎంచుకోమని కోరింది. అందులో మొదటి రెండు లబ్ధిదారులకు డబ్బులు ఇస్తే కట్టుకునేలా.. మూడోది ప్రభుత్వమే నిర్మించుకునేలా ఆప్షన్ ఉంది.
    మొదటి రెండు ఆప్షన్లలో ప్రభుత్వం ఇచ్చే మొత్తం సొమ్ము రూ.లక్షా ఎనభై వేల రూపాయలు మాత్రమే.

    Also Read: తిరుపతి చేరుకున్న టీడీపీ వ్యూహకర్త

    వాటితో బెడ్ రూం, కిచెన్, హాల్, వరండా ఉన్న శ్లాబ్ ఇల్లు ఎలా వస్తుందనేది చాలా మందికి మిస్టరీగా మారింది. కానీ ప్రభుత్వం మాత్రం మోడల్ హౌస్ కట్టి చూపించింది. ప్రదర్శనకు పెట్టింది. దానికి రూ.లక్షా ఎనభై వేలు మాత్రమే ఖర్చు అయిందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. అంత మాత్రమే లబ్ధిదారులకు ఇస్తామంటోంది. అయితే వాస్తవంగా ఒక్క ఇల్లు కట్టుకోవాలంటే అదీ కూడా ప్రభుత్వం చెప్పిన ప్రమాణాల్లో కట్టుకోవాలంటే ఎడెనిమిది లక్షలు అవుతుందనేది వాస్తవం. 340 చదరపు అడుగుల ఇల్లు కట్డడానికి తాపీ మేస్త్రీలే రూ.70 వేలు వసూలు చేస్తారని.. ఇక సెంట్రింగ్ సహా ఇతర పనులన్నింటికీ ఎక్స్‌ట్రా అవుతాయని గుర్తు చేస్తున్నారు.

    Also Read: అలిగినోళ్లందరికీ పార్టీ పదవులు..: అసంతృప్తులకు కాంగ్రెస్‌ బుజ్జగింపులు

    మెటీరియల్స్‌ సంగతి చెప్పాల్సిన పని లేదు. మూడు నెలల కాలంలో 20 శాతం వరకూ పెరిగాయి. ప్రభుత్వం డబ్బులు ఇస్తే లబ్ధిదారులు సగం కట్టుకుని పూర్తి చేసే దారి లేక ఆపేస్తారు. అదే ప్రభుత్వమే నిర్మిస్తే సమస్య లేకుండా ఉంటుందంటున్నారు. లబ్ధిదారులకు డబ్బులిస్తామని చెప్పడం కన్నా ప్రభుత్వం నిర్మిస్తేనే జగన్ చెప్పినట్లు ఇళ్లు మాత్రమే కాదు ఊళ్లను కూడా శరవేగంగా నిర్మించడానికి అవకాశం ఉంటుందన్న చర్చ నడుస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్