
పేటీఎం ఖాతాను అప్‌డేట్ చేస్తానంటు అకైంట్‌లోని లక్షల రూపాయలు కొల్లగ్టొన ముఠాను సైబరాబాద్ పోలసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన వినయ్ శర్మకు ఒక్కరూపాయి డిపాజిట్ చేస్తే పేటీఎం ఖాతాను అప్‌డేట్ చేస్తామని మెసేజ్ వచ్చింది. మెసేజ్‌లో ఉన్న లింక్‌కు ఓపెన్ చెయగా కొద్ది సేపటికి తన ఖాతాలోని 4.29 లక్షలు మాయమైనట్లు గుర్తించాడు. దీంతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించగా ఈ మోసాలకు పాల్పడిన వారు జార్ఘండ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. ఇక ముందు కూడా ఆన్ నౌన్ లింక్స్ వస్తే ఓపెన్ చేయవద్దని ఎవరైనా అపరిచితులు కాల్ చేసి డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదులు చేయాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.