న్యూస్ ఛానెల్స్‌లో సంచలనం సృష్టించే వార్త సంస్థగా పేరున్న టీవీ-9 ఈ మధ్య సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందట.. అందులోని ఇద్దరు కీలక వ్యక్తుల మధ్య వైషామ్యాలు తారాస్థాయికి చేరాయానే టాక్ మీడియా వర్గాల్లో సాగుతోంది. ఆ వైషమ్యాలతో ఏకంగా ఒకరు తమ విధుల నుంచి తప్పుకునేదాకా వచ్చిందట. ఈ మేరకు మీడియా సర్కిల్స్ లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కీలక బిల్లులకు ఆమోదం..!
టీవీ-9 నుంచి రవిప్రకాశ్ కేసులతో బయటపడ్డాక.. ప్రముఖ జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న సింగారావు టీవీ-9కు సీఈవోగా అయ్యారు. అయితే ఆయన విధుల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన అలా ఒక్కసారిగా ఛానెల్ నుంచి బయటికి వెళ్లడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.
టీవీ-9 సంస్థలో ప్రముఖంగా పనిచేసే రజినీకాంత్‌కు, సింగారావుకు మధ్య విభేదాల వల్లే సింగారావు సంస్థ నుంచి వైదొలిగినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే కొంతమంది వ్యక్తులు కలిసి సింగారావును సాగనంపినట్లు ప్రచారం సాగుతోంది. ఒక దశలో టీవీ-9 కోసం సింగారావు పనికట్టుకొని కష్టపడ్డాడు. ఛానెల్ రేటింగ్ కోసం తీవ్రంగా శ్రమపడ్డాడు. అయితే రజనీకాంత్‌తో వాగ్వాదం జరిగిన తరువాత సింగారావు ఎడిటోరియల్ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం సాగుతోంది.. దీంతో వార్తలకు ప్రాధాన్యం తగ్గిందనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా పెయిడ్ ప్రమోషన్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని కొందరు ప్రచారం చేశారట..
Also Read: రైతు కన్నెర్ర చేస్తే.. ప్రభుత్వాలకు ఏ గతిపడుతుంది?
ఇది సింగరావుకు తెలియకుండా మరో కీలక వ్యక్తి వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల సంస్థకు లాభం లేకపోయినా కొంతమందికి మాత్రం లబ్ధి చేకూరుతుందట.. దీనిని సింగరావు అడ్డుకున్నారని సమాచారం. ఇలాంటి వ్యవహారాలు నచ్చని కొందరు ఆయనను బయటకు పంపేలా ప్లాన్ వేసినట్లు సమాచారం.చానెల్ రేటింగ్ పడిపోవడం.. దీనికి మొత్తం తప్పంతా సింగారావుదేనని తేల్చడంతో ఆయనపై ఒత్తిడిలు పెరిగాయని.. దీంతో స్వయగా ఆయన సంస్థ నుంచి వైదొలుగినట్లు సమాచారం. మరి ఇదంతా నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై టీవీ9 కానీ.. సింగారావు కానీ స్పందించలేదు.