
యాసంగి కాలంలోనూ మక్కల సాగు వేయొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో మంత్రులతో కలిసి పంటల సాగు విధానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మ్తంరి నిరంజన్‌రెడ్డి సంబంధిత అధికారులు హాజరయ్యారు. వానకాలం పంట మాదిరిగానే యాసంగిలోనూ నియంత్రిత సాగు విధానాన్ని అవలంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఏఏ పంటలపై ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే దానిపై చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈసారి సాగు విస్తీర్ణం 72 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని మంత్రి ఇదివరే ప్రకటించారు.