Madhya Pradesh: మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. నచ్చిన తిండి తింటున్నాం. ఇష్టం వచ్చిన ఊరు తిరుగుతున్నాం. నచ్చిన వాళ్లతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. కుటుంబ సభ్యులతో ప్రతిక్షణాన్ని పరమానంద భరితంగా గడుపుతున్నాం. మనం ఈ స్థాయిలో హాయిని.. స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే దీనికి ప్రధాన కారణం మన దేశ సైన్యం. సైన్యంలో పనిచేసేవారు కుటుంబ జీవితాన్ని దూరంగా ఉంటారు. వ్యక్తిగత సుఖాలకు దూరంగా ఉంటారు. దేశ సేవకు మాత్రమే పరిమితమవుతుంటారు. ఇలాంటి సమయంలో ఏవైనా ఘటనలు ఎదురైతే చివరికి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడుతుంటారు.
జమ్ము కాశ్మీర్ నుంచి మొదలు పెడితే రాజస్థాన్ వరకు ప్రతి సరిహద్దులో మన దేశానికి కాపలాగా వేలాదిమంది సైనికులు ఉంటారు. వీరంతా 24*7, 365 రోజులు పహార కాస్తూనే ఉంటారు. ఏమాత్రం చిన్న అలికిడి వినిపించినా.. శత్రుమూకలు మనదేశంలోకి ప్రవేశించాలని చూసినా.. వెంటనే అలర్ట్ అయిపోతారు. తమ చేతుల్లో ఉన్న తుపాకులకు పని చెబుతారు. చూస్తుండగానే బుల్లెట్లను శత్రువుల గుండెల్లో దింపుతారు. కొన్ని సందర్భాలలో వీరమరణం కూడా పొందుతుంటారు. ఇలా దేశం కోసం వీరమరణం పొందేవారు ఏటా చాలా మంది ఉంటారు. అయితే వీరి నేపథ్యాలు గుండెను కదిలిస్తాయి. కన్నీటిని తెప్పిస్తాయి.
దేశ సరిహద్దుల్లోనే కాదు అప్పుడప్పుడు.. దేశంలో ఉన్న అంతర్గత శత్రువులను తుద ముట్టించడానికి బలగాలు పోరాటం చేస్తాయి. ఇలాంటి ఘటనలలో బలగాలలో పనిచేస్తున్నవారు వీరమరణం పొందుతుంటారు. ఇలా వీరమరణం పొందే వారి నేపథ్యం బాధాకరంగా ఉంటుంది. అటువంటి నేపథ్యమే ఈ అధికారిది కూడా. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ మావోయిస్టులతో పోరాడాడు. చివరికి తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ అధికారికి మరో రెండు నెలల్లో వివాహం జరగనుంది. ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడంతో తోటి సిబ్బంది మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు, కాబోయే భార్య ఆశలు మొత్తం అడియాసలయ్యాయి. మధ్యప్రదేశ్ ఎలైట్ హాక్ ఫోర్స్ కు చెందిన ఇన్స్పెక్టర్ ఆశిష్ శర్మ రాజ్ నంద్ గావ్ అడవుల్లో మావోయిస్టులతో పోరాడుతూ వీరమరణం పొందారు. చర్మ రెండుసార్లు శౌర్య పతకాలు అందుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అనేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. నర్సింగపూర్ ప్రాంతానికి చెందిన ఓ రైతు కుమారుడు ఆశీష్ శర్మ. మరో రెండు నెలల్లో అతడికి వివాహం జరగాల్సి ఉంది.