దుబ్బాక ఎన్నిక వేళ.. రఘునందన్‌రావును వెంటాడుతున్న ఆ మహిళ ఎవరు..?

ప్రస్తుతం రాజకీయ నాయకుల దృష్టంతా దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక వైపే ఉంది. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీలు ఈ స్థానం కోసం పట్టుబడుతున్నాయి. గత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ లింగారెడ్డి సతీమణికి టికెట్‌ ఇచ్చి బరిలో నింపింది. కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీలో ఉండగా.. బీజేపీ నుంచి రఘునందన్‌రావులు తమ స్థానం దక్కించుకోవడానికి ఇప్పటికే ప్రచారం […]

Written By: NARESH, Updated On : October 11, 2020 10:09 am
Follow us on

ప్రస్తుతం రాజకీయ నాయకుల దృష్టంతా దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక వైపే ఉంది. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీలు ఈ స్థానం కోసం పట్టుబడుతున్నాయి. గత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ లింగారెడ్డి సతీమణికి టికెట్‌ ఇచ్చి బరిలో నింపింది. కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీలో ఉండగా.. బీజేపీ నుంచి రఘునందన్‌రావులు తమ స్థానం దక్కించుకోవడానికి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు.

Also Read: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భూకంపం.. ఎందుకొస్తుందంటే?

టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా తామేనని భావిస్తున్న బీజేపీ నుంచి రఘునందర్‌రావు ఇప్పటికే జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల్లోనే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా టీఆర్‌ఎస్‌ తప్పులను, హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. అటు టీఆర్‌ఎస్‌ సైతం పార్టీలోని ముఖ్యనాయకుడు హరీశ్‌రావు ఈ ఎన్నికను బాధ్యతగా తీసుకున్నాడు. టీఆర్‌ఎస్‌ తప్ప ఇంకే పార్టీ రాష్ట్రానికి న్యాయం చేయదని వివరిస్తున్నారు.

ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థి రఘునందర్‌రావుకు ఓ మహిళ రూపంలో చిక్కులు పడుతున్నాయి. ఇప్పటికే రూ.40 లక్షల రూపాయలు ఎన్నికల కోసం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న రఘునందర్‌రావుపై తాజాగా దుబ్బాకలో ఆయనకు వ్యతిరేకంగా ఓ మహిళ ప్రచారం చేస్తుండడం సంచలనంగా మారింది.. ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయద్దంటూ మరీ చెబుతుండడం రఘునందన్ రావును ఇరుకునపెడుతోంది..

Also Read: రాజకీయాలపై ‘రౌడీ దేవరకొండ’ సంచలన కామెంట్స్..!

ఓ కేసు విషయంలో తాను న్యాయవాది అయిన రఘునందర్‌రావు వద్దకు వెళితే లైంగిక దాడికి పాల్పడ్డాడడని, ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గానికే అవమానమంటూ రాధారమణి అనే మహిళ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తోంది. అయితే బీజేపీ శ్రేణలు మాత్రం ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నందునే ఇలా మహిళతో టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక బీజేపీ మాత్రం సోషల్‌ మీడియాలో రకరకాల షార్ట్‌ఫిల్మ్‌లతో ప్రచారం తీవ్రం చేసింది. ముఖ్యంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు.