Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్బొల్లారంలో భారీ పేలుడు: 10 మంది ఆసుపత్రికి తరలింపు

బొల్లారంలో భారీ పేలుడు: 10 మంది ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్ శివారులోని బొల్లారంలో భారీ పేలుడు సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ శబ్దాలతో పేలుడు జరగడంతో కార్మికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ పేలుడుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ లోని వింద్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు కార్మికులు పరుగులు తీసే క్రమంలో కొందరు కిందపడిపోయి అపస్మాకర స్థితో పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మందిని ఆసుప్రతికి పంపించినట్లు, వీరిలో నలుగురు పరిస్థితి విషంగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular