
తెలంగాణ పీసీపీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ ముగిసింది. గత మూడు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే పీసీసీ, సీఎల్పీ నేతలు పార్టీ ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కాసేపట్లో పీసీసీ, సీఎల్పీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల సమావేశం నిర్వహించనునన్నారు. అనంతరం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే అధ్యక్ష పదవిపై ఎవరికి వారే తనకే దక్కాలని నాయకులు ఆశిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మానిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేజగ్గారెడ్డి మాట్లాడుతూ ఏదైనా సరే ఏకాభిప్రాయంతోనే జరగాలని, వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటే పార్టీకే నష్టమని అన్నారు. కాంగ్రెస్ ను రోడ్డుపాలు చేసేకుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.