https://oktelugu.com/

వివాహిత ఆత్మహత్య..  సంగారెడ్డి లో విషాదం

సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెండ్లి అయిన మూడు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త విధులకు వెళ్లివచ్చేసరికే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం చిట్కుల్లోని నాగార్జున కాలనీకి పదిహేను రోజుల క్రితం రాఘవేంద్ర, సుకన్య దంపతులు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. కర్థనూరు సమీపంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో రాఘవేంద్ర కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం భర్త విధులకు వెళ్లగా.. ఇంట్లో ఉరివేసుకొని సుకన్య ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 4, 2020 / 02:51 PM IST
    Follow us on

    సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెండ్లి అయిన మూడు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త విధులకు వెళ్లివచ్చేసరికే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం చిట్కుల్లోని నాగార్జున కాలనీకి పదిహేను రోజుల క్రితం రాఘవేంద్ర, సుకన్య దంపతులు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. కర్థనూరు సమీపంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో రాఘవేంద్ర కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం భర్త విధులకు వెళ్లగా.. ఇంట్లో ఉరివేసుకొని సుకన్య ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం దార్లపాడు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.