పోలీసులకు వార్నింగ్‌తో మావోయిస్టుల పోస్టర్లు.. ములుగు జిల్లాలో కలకలం..
పోలీసులు కూంబింగ్ ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని మావోయిస్టుల పేరిట వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామంలో తాజాగా మావోయిస్టుల పేరిట వాల్ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ పోలీసులు అడవుల్లో కూంబింగ్ ఆపకపోతే ఇటీవల టీఆర్‌ఎస్ నాయకుడు భీమేశ్వర్‌రావుకు పట్టిన గతే ఇతర టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పడుతుందని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. అలాగే ఫారెస్టు అధికారులు డీఆర్‌వో ప్రహ్లాద్, రవీందర్, సందీప్‌లు తమ […]
పోలీసులు కూంబింగ్ ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని మావోయిస్టుల పేరిట వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామంలో తాజాగా మావోయిస్టుల పేరిట వాల్ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ పోలీసులు అడవుల్లో కూంబింగ్ ఆపకపోతే ఇటీవల టీఆర్‌ఎస్ నాయకుడు భీమేశ్వర్‌రావుకు పట్టిన గతే ఇతర టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పడుతుందని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. అలాగే ఫారెస్టు అధికారులు డీఆర్‌వో ప్రహ్లాద్, రవీందర్, సందీప్‌లు తమ పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదని, ప్రజలు సమస్యలు అడిగితే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ పోస్టర్లతో స్థానిక ప్రాంతంలో కలకలం రేపుతోంది.