https://oktelugu.com/

రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ చానెళ్లపై బాలీవుడ్ ప్రముఖుల యుద్ధం.. హైకోర్టుకు..

2020 ..పాపం బాలీవుడ్ కు అసలు కలిసి రాలేదు.. ఈ ఏడాదిలో కరోనా తర్వాత అంతటి చర్చ జరిగిన విషయం.. సినిమా ధోనీ సుశాంత్ రాజ్పుత్ సింగ్  మరణం.  తీగ లాగితే డొంక కదిలినట్లు కేసు విచారణలో ఒక దాని తర్వాత ఒకటి బయటపడుతూనే ఉంది. సుశాంత్ ప్రియురాలు రియా విచారణలో తేలిన  డ్రగ్స్ వ్యవహరం.. దీని లింక్ కన్నడ, తెలుగు హీరోయిన్ల దాక రావడంతో దేశంలోని బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ల్లో  పెను ప్రకంపనాలు వచ్చాయి. జాతీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 / 10:58 AM IST
    Follow us on

    2020 ..పాపం బాలీవుడ్ కు అసలు కలిసి రాలేదు.. ఈ ఏడాదిలో కరోనా తర్వాత అంతటి చర్చ జరిగిన విషయం.. సినిమా ధోనీ సుశాంత్ రాజ్పుత్ సింగ్  మరణం.  తీగ లాగితే డొంక కదిలినట్లు కేసు విచారణలో ఒక దాని తర్వాత ఒకటి బయటపడుతూనే ఉంది. సుశాంత్ ప్రియురాలు రియా విచారణలో తేలిన  డ్రగ్స్ వ్యవహరం.. దీని లింక్ కన్నడ, తెలుగు హీరోయిన్ల దాక రావడంతో దేశంలోని బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ల్లో  పెను ప్రకంపనాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో ప్రసార మాధ్యమాల్లో విపరీతంగా చర్చ జరిగింది.

    Also Read: ఏపీ తీరం దాటిన వాయుగుండం.. ప్రజలకు హెచ్చరిక

    ప్రపంచంలోనే హాలీవుడ్ తర్వాత రెండో స్థానంలో బాలీవుడ్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్లకు ఇండియాలోనే కాక వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంది. వీరికున్నా క్రేజ్ అంతా ఇంతా కాదు.. కోట్లాది అభిమానులు వీరిని దేవుళ్లలా ఆరాధిస్తారు. ఎన్నో ఏండ్లుగా సినిమాల రూపంలో, టూరిజం రూపంలో ఆదాయానికి వనరుగా బాలీవుడ్ ఉంటోంది. ప్రేక్షకులు ఆరాధనతోనే ఇదంతా సాధ్యమైంది. అలాంటి బాలీవుడ్ చరిత్రకు డ్రగ్స్ మసక అంటింది.

    ఎప్పుడు ఏం జరుగుతుందా.. 24 గంటలు చానెళ్లను ఆడిచ్చేదాం.. టీఆర్ఎపీలు కొల్లగొట్టేద్దామనుకునే  టీవీ చానెళ్లు, సోషల్ మీడియా  ఉండనే ఉన్నాయి.. బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేసేశాయి.  రోజుకో కథనంతో   షడ్రుచులు వండివార్చాయి.    ఇంకా కొందరు ముందుకెళ్లి బాలీవుడ్ నీచమని, డ్రగ్స్ బానిసలతో నిండిపోయిందని,  డ్రగ్స్ లేకుండా పార్టీలే జరుగవని ఆరోపించారు.

    Also Read: ఆంధ్ర ప్రజాభిప్రాయ సర్వేలో ఆసక్తికర గణాంకాలు

    ఈ విషయం ఇంతటితో ఆగేలా లేదని బాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాజ్యం వేసిన వారిలో కరణ్ జోహర్, యశ్ రాజ్, అనిల్ కపూర్, అజయ్ దేవ్గణ్, అమీర్ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితర 38 నిర్మాణ సంస్థలకు చెందిన వారు ఉన్నారు. రిపబ్లిక్ టీవీకి చెందిన అర్ణబ్ గోస్వామి, ప్రదీప్ భండారి, టైమ్స్ నౌకు చెందిన రాహుల్ శివశంకర్, నవికా కుమార్లు బాలీవుడ్ పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీ చానెళ్లు, సోషల్ మీడియాలో తమ పర్సనల్ లైఫ్ను టార్గెట్ చేస్తున్నారని, మొత్తం పరిశ్రమనే నేరస్తులు, డ్రగ్స్ బానిసలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. నిరాధార, అసభ్యకర వ్యాఖ్యలను అడ్డుకోవాలని కోరారు. సినీ ప్రముఖులపై మీడియానే విచారణ నిర్వహించడాన్ని ఆపాలని కోర్టుకు విన్నవించారు.