తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం

తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ నూతన చట్టం ప్రకారం ధరణి వెబ్ సైట్ ద్వారా ఈ ప్రక్రియ సాగనుంది. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా కోర్టులో సాగినా.. చివరికి కోర్టు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభ కానున్నాయి. ఈనెల 11న రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభించారు. అప్పటి నుంచి స్లాట్ బుకింగ్ […]

Written By: Suresh, Updated On : December 14, 2020 9:38 am

Land Rigistration

Follow us on

తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ నూతన చట్టం ప్రకారం ధరణి వెబ్ సైట్ ద్వారా ఈ ప్రక్రియ సాగనుంది. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా కోర్టులో సాగినా.. చివరికి కోర్టు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభ కానున్నాయి. ఈనెల 11న రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభించారు. అప్పటి నుంచి స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి నేటి నుంచి రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. దీంతో భూములు క్రయ, విక్రయాలు చేసుకునేవారు ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళుతున్నారు.