
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నగరవాసులకు నూతన సంవత్సర బహుమతిని ప్రకటించారు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన తాగునీటి హామీని జనవరిలో నెరవేర్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పురపాలక సంఘం మంత్రి కేటీఆర్ శనివారం తాగునీటి పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సరం తొలివారంలో హైదరాబాద్ లో ఉచిత తాగునీటి కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు జలమండలి ద్వరా 20 వేల లీటరల్ వరకు ఉచితంగా తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. తాగునీటి పంపిణీ కోసం ఒకట్రెండు రోజుల్లో విధి విధానాలను రూపొందించాలని కేటీఆర్ ఆదేశించారు.