కీసర భూవివాదం కేసు: ధర్మారెడ్డి ఆత్మహత్య

కీసర భూ వివాదం కేసులో కోటి రూపాయల లంచం డిమాండ్‌ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లిన తహసీల్దార్‌ నాగరాజు ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈ వివాదంలో అరెస్టయి ఇటీవలే బెయిలుపై వచ్చిన ధర్మరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడ వాసవినగర్‌ శివాలయంలో చెట్టుకు ఉరివేసుకొనడం చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో రూ. 40 కోట్ల విలువచేసే 24 ఎకరాల 16 గుంటల భూమిని ధర్మారెడ్డి […]

Written By: Suresh, Updated On : November 8, 2020 10:22 am
Follow us on

కీసర భూ వివాదం కేసులో కోటి రూపాయల లంచం డిమాండ్‌ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లిన తహసీల్దార్‌ నాగరాజు ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈ వివాదంలో అరెస్టయి ఇటీవలే బెయిలుపై వచ్చిన ధర్మరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడ వాసవినగర్‌ శివాలయంలో చెట్టుకు ఉరివేసుకొనడం చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో రూ. 40 కోట్ల విలువచేసే 24 ఎకరాల 16 గుంటల భూమిని ధర్మారెడ్డి తమ బంధువుల పేర్ల మీద కీసర తహసీల్దార్‌ నాగరాజు సహాయంతో పట్టా చేయంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసబీ వీరిని తహసీల్దార్‌ నాగరాజుతో పాటు ధర్మారెడ్డిని అరెస్ట చేసిన విషయం తెలిసిందే. కాగా ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.