
కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మ్రుతి చెందారు. రాష్ట్రంలోని చిత్రదుర్గలో జరిగిన ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.