
దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేని ఓ టీఆర్ఎస్ కార్యకర్త గుండెపోటుతో మరణించారు. దౌల్తానాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త కొత్తింటి స్వామి నిన్న దుబ్బాక ఫలితాలను తెలుసుకున్న తరువాత రాత్రి గుండెపోటుతో మరణించాడు. కాగా స్వామి అంత్యక్రియల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఆయన పాడెను స్వయంగా మోశాడు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనన్నారు. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారరం కావన్నారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నారు. స్వామి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.