
హైదరాబాద్ శామీర్‌పేటలోని భారత బయోటెక్‌ను మంగళవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సందర్శించారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చెప్పినట్టు దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల 2020లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని గవర్నర్ తెలిపారు.
Also Read: బీజేపీ నేతల మౌనం వెనుక అసలు కథేంటి?