
నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ జోష్ మీదున్నారు. వరుసగా క్రేజీ డైరెక్టర్లతో సినిమాలకు కమిట్ అవుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు బోయపాటితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పట్టాలమీద ఉండగానే దర్శకుడు బీ.గోపాల్ తో ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ ను కూడా బాలయ్య లైన్లో పెట్టడం ఆసక్తిని రేపుతోంది.
Also Read: వైరల్ పిక్స్: ‘స్నేహ’తో అల్లు అర్జున్ సెలబ్రేషన్స్..!
బాలయ్య-వినాయక్ కాంబినేషన్లో గతంలో ‘చెన్నకేశవరెడ్డి’ మూవీలో వచ్చింది. పవర్ ఫుల్ మాస్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ మూవీ అభిమానులను అలరించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ఓ మూవీ వస్తుందని అభిమానులు భావించారు. అయితే అనుకోని కారణాలతో ఇప్పటివరకు సినిమా రాలేదు. అయితే తాజాగా బాలయ్యతో ఓ మూవీ చేసేందుకు వి.వి.వినాయక్ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ఇప్పటికే స్క్రీప్ట్ కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ రావాలని అభిమానులు కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు.
Also Read: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ పై అనుకోని ట్విస్ట్?
ప్రస్తుతం బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘సింహా’.. ‘లెజండ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీలు వచ్చాయి. ఇటీవల ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజుగా కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత దర్శకుడు బీ.గోపాల్ తో బాలయ్య ఓ మూవీ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో అప్పట్లో ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డు కొట్టిన మూవీలు వచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్లో ఓ మూవీ వస్తుండటం విశేషం.