Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌: బోనస్‌ ప్రకటించేశారు..

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌: బోనస్‌ ప్రకటించేశారు..

సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. దీపావళి బోనస్‌ కింద రూ.68,500 చెల్లించనున్నట్లు శనివారం సింరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12న కార్మికులకు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. దీనికి గాను 2019-20 ఆర్థిక సంవత్సరంలో అండర్‌గ్రౌండ్‌లో విధులు నిర్వహించిన వారు 190 మస్టర్లు, సర్ఫేస్‌లో పనిచేసేవారు 240 మస్టర్లు ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పీఆర్‌ఎస్‌ బోన్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, పదో వేజ్‌బోర్డు కిందకు వచ్చిన వారికి వర్తిస్తుందని సింగరేణి యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో సింగరేణి కార్మిక కుటుంబాల్లో దీపావళి పండగు ముందే మొదలైనట్లయింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular