
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లు దేశీ బంగారం ధరలపై ప్రభావం చూపడంతో మళ్లీ పసిడి ధరలు పైపైకి వెళుతున్నాయి. హైదరాబాద్ లో శుక్రవారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో 46,700గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ రూ.110 పెరిగి రూ.50,940కి చేరింది. వెండి కూడా రూ.900 పెరిగి రూ.71,400 గా ఉంది. వివాహాల సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. దీంతో పసిడి ధరల్లో పెరుగుదల పెరుగుదల కనిపిస్తోంది.