ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు ను ఆమోదించారు. అంతకుముందు ఈ బిల్లును మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఈ బిల్లును ఆమోదించారు. అయితే ఈ బిల్లును మండలి ఆమోదం పొందాల్సి ఉంది. కానీ జగన్ మాట్లాడుతూ ఈ బిల్లుపై గతంలోనే చర్చించామని, అప్పుడు ఆమోదం పొందిన తరువాత మండలికి పంపిస్తే దానిని తిరిగి అసెంబ్లీకి పంపిచారన్నారు. బిల్లుపై టీడీపీ అభ్యంతరాలు పెడుతూ అవగాహన లేకుండా మాట్లాడుతోందన్నారు. ఇక్కడ 151 మంది శాసనసభ్యలు గతంలో ఆమోదించారని, ఇప్పడు కేవలం ఫర్మాలిటీస్ మాత్రమేనన్నారు.