https://oktelugu.com/

వరదలో గల్లంతైన వారిలో నలుగురు మృతి

రంగారెడ్డి జిల్లాలో వరదల కారణంగా కొట్టుకుపోయిన 8 మందిలో నలుగురి మృతేదేహాలు శుక్రవారం ఉదయం బయటడ్డాయి. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని అలీనగర్‌లో బుధవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఇంటి వద్ద కూర్చున్న అబ్దుల్‌ తాహిర్‌ కుటుంబానికి చెందిన 8 మంది ఒక్కసారి వరద రావడంతో నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. గురువారం రాత్రి రెండు మృతదేహాలు అభ్యం కాగా.. శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం వర్షం లేకపోవడంతో నీటి ఉధృతి తగ్గింది. […]

Written By: , Updated On : October 16, 2020 / 10:08 AM IST
Follow us on

రంగారెడ్డి జిల్లాలో వరదల కారణంగా కొట్టుకుపోయిన 8 మందిలో నలుగురి మృతేదేహాలు శుక్రవారం ఉదయం బయటడ్డాయి. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని అలీనగర్‌లో బుధవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఇంటి వద్ద కూర్చున్న అబ్దుల్‌ తాహిర్‌ కుటుంబానికి చెందిన 8 మంది ఒక్కసారి వరద రావడంతో నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. గురువారం రాత్రి రెండు మృతదేహాలు అభ్యం కాగా.. శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం వర్షం లేకపోవడంతో నీటి ఉధృతి తగ్గింది. దీంతో మృతదేహాలు బయటికి వస్తున్నాయి. కాగా మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.