https://oktelugu.com/

జగన్ లేఖ: అమెరికాలోనూ ప్రకంపనలు.. ప్రవాసాంధ్రులు ఏమనుకుంటున్నారు?

ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ప్రకంపనలు అగ్రరాజ్యం అమెరికాలోనూ ప్రతిధ్వనించాయి. దేశంలో, ఏపీలోనే కాదు.. అమెరికాలోనూ పలువురు గొంతెత్తుతుండడం విశేషంగా మారింది. జగన్ రాసిన లేఖపై అమెరికాలోని ప్రవాస ఆంధ్రుల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే ఏపీ, తెలంగాణ నుంచి లక్షల మంది తెలుగు వారు అమెరికాలో నివాసముంటున్నారు. సహజంగానే ఏపీ,తెలంగాణ రాజకీయాలపై వారికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ తీసుకున్న స్టెప్ పై తమ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2020 / 10:16 AM IST
    Follow us on

    ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ప్రకంపనలు అగ్రరాజ్యం అమెరికాలోనూ ప్రతిధ్వనించాయి. దేశంలో, ఏపీలోనే కాదు.. అమెరికాలోనూ పలువురు గొంతెత్తుతుండడం విశేషంగా మారింది. జగన్ రాసిన లేఖపై అమెరికాలోని ప్రవాస ఆంధ్రుల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే ఏపీ, తెలంగాణ నుంచి లక్షల మంది తెలుగు వారు అమెరికాలో నివాసముంటున్నారు. సహజంగానే ఏపీ,తెలంగాణ రాజకీయాలపై వారికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ తీసుకున్న స్టెప్ పై తమ అభిప్రాయాలను వారు కుండబద్దలు కొడుతున్నారు. దేశంలోని కొందరు మేధావులు ఇప్పటికీ దీనిపై స్పందించడానికి భయపడుతున్నా.. దేశం బయట ఉన్న వారికి అలాంటి నిబంధనలు, కట్టుబాట్లు లేకపోవడంతో జగన్ లేఖపై వారు స్వేచ్ఛగా స్పందిస్తున్నారు. జగన్ లేఖకు చాలామంది తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు.

    Also Read: అన్ని కేసులు సీబీఐకి.. న్యాయం జరుగుతోందా?

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరుపై, ప్రతిపక్ష నేత చంద్రబాబు, సుప్రీం కోర్టు జడ్జికి ఉన్న సంబంధాలపై సీఎం జగన్‌ సుప్రీం కోర్టుకు ఆధారాలతో సహా అందించడంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు జడ్జి, ఇతర న్యాయవాదులపై జగన్‌ పంపిన లేఖపై నిష్పక్షపాతంగా నిజాలు నిగ్గు తేల్చాలని  కొందరు డిమాండ్ చేస్తున్నారు..

    న్యాయవ్యవస్థపై ఏపీ సీఎం జగన్‌ చేస్తున్న పోరాటంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియా, న్యాయకోవిదులు జగన్‌కు మద్దతు ఇస్తున్నా కొందరు పని గట్టుకొని ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొందరు నెటిజన్లు జగన్‌కే మా మద్దతు అంటూ పోస్టులు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జగన్‌ సుప్రీకోర్టు జడ్జికి లేఖ ద్వారా వివరించడంపై జాతీయ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. టీవీ చానెళ్లలో సైతం పలు చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ద హిందుస్థాన్‌ టైమ్స్‌ లాంటి పత్రికలు ఈ వార్తలను ప్రముఖంగా ప్రచురించాయి. దీనిపై పలువురు ట్వీట్లు కూడా చేశారు.

    న్యాయవ్యవస్థపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లను కదిలించింది. జగన్‌కు మద్దతు ఇస్తూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన కథనాలను ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్‌లో జగన్‌కు మద్దతు పలుకుతున్నారు ప్రొఫెసర్లు. సుప్రీం కోర్టు జడ్జి, ఇతర లేఖలపై నిగ్గు తేల్చాల్సిందేనని జగన్‌ లేవనెత్తిన అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది.

    Also Read: తెలంగాణ పీజీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.?

    ఏపీలోని కొందరి న్యాయమూర్తులపై సీఎం జగన్‌ లేఖ రాయడంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, ఇండియాటుడే కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌, అమెరికా హార్వర్స్‌ ప్రొపెసర్‌ ప్రముఖ జర్నలిస్టు నిధి రాజ్‌దాన్‌లు మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది.ఇండియాటుడే కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై పెద్ద కథనమే రాశారు.

    సుప్రీం కోర్టు జడ్జిపై ఆరోపణలు నిజమైతే, కాకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో కొందరు న్యాయవాదులు డిబేట్లు పెడుతున్నారు. ఇక అమెరికా హార్వర్స్‌ ప్రొపెసర్‌ ప్రముఖ జర్నలిస్టు నిధి రాజ్‌దాన్‌ సుప్రీం కోర్టు జడ్జికి లేఖ రాయడంపై జగన్‌కు మద్దతు పలికారు. అవినీతిని పాలద్రోలడానికి జగన్‌ సిద్ధమయ్యాడంటూ ట్వీట్‌ ద్వారా తెలిపారు.