
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల (ఎఫ్‌బీవో) ధ్రువపత్రాల పరిశీలన వచ్చేనెల రేపటి నుంచి ప్రారంభం కానుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను వారంరోజులపాటు ఆన్‌లైన్‌లో నిర్వహిచనున్నామని అధికారులు ప్రకటించారు. ఇందుకు ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తెస్తున్నామని, 2021 జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు ఈ లింకు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వెబ్‌ఆప్షన్లు కూడా ఇవే తేదీల్లో ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లను www. tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వారు మాత్రమే ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు.